జనసేనలో చేరిన భాజపా ఎమ్మెల్యే

జనసేనలో చేరిన భాజపా ఎమ్మెల్యే

విజయవాడ: భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం శాసనసభ్యుడు ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరారు. విజయవాడలో పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో సతీసమేతంగా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరానని చెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కీలకంగా మారబోతోందన్నారు. పవన్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే పూర్తి విశ్వాసం తనకుందని, అందుకే సతీసమేతంగా పార్టీలో చేరానని తెలిపారు. పదవులు ఆశించి కాకుండా పార్టీ నాయకుడిపై ఉన్న అభిమానం, నమ్మకం కొద్దీ తాను కూడా జనసేనలో చేరినట్లు ఆకుల సత్యనారాయణ సతీమణి లక్ష్మీ పద్మావతి తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos