అక్రమ్‌కు అవమానం

  • In Sports
  • July 23, 2019
  • 197 Views
అక్రమ్‌కు అవమానం

మాంచెస్టర్ : పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌కు మాంచెస్టర్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. మాంచెస్టర్ విమానాశ్రయంలో అతనిని అధికారులు నిర్బంధించారు. ఇన్సులిన్ వెంట ఉండడంతో అనుమానంపై అధికారులు తనిఖీ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వసీమే వెల్లడించాడు. అధికారుల చర్య చాలా బాధను కలిగించిందని వాపోయాడు. తన ఇన్సులిన్‌తో తాను ప్రపంచమంతా తిరుగుతానని, కానీ ఈ రోజు చాలా ఇబ్బంది కలిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చాలా దారుణంగా ప్రశ్నించారని, అవమానించారని వాపోయాడు. కోల్డ్ కేసులో ఉన్న తన ఇన్సులిన్‌ను బయటకు తీసి ప్లాస్టిక్ సంచిలో పడేశారని బాధపడ్డాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos