హైదరాబాదు: అయోధ్య బాబ్రీ మసీదును కూల్చివేసిన వారందరినీ కారాగారంలో బంధించాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ డి మాం డ్ చేశారు.మంగళ వారం మోహిదీపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మసీదు కూల్చి వేతపై త్వరితగతిన విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని డిమాండు చేసారు. అయోధ్య తీర్పును సమీక్షించాలని ఆల్ ఇండి యా ముస్లిం పర్సనల్ లా బోర్డు అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేయటాన్ని స్వాగతిస్తున్నామని చె ప్పా రు. డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత రోజుగా పాటిస్తామన్నారు.అయోధ్యలో మసీదు నిర్మాణానికి వేరే చోట ఐదు ఎక రాల స్థలాన్ని ఇవ్వాలనే అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. బాబ్రీ మసీదును పున ర్ని ర్మాణానికి డిసెంబర్ 6న ప్రజాస్వామ్య శాంతి యుత పద్ధతిలో ఆందోళన చేయాలని సూచించారు. ఆ రోజున అందరూ తమ దుకా ణాలను తెరిచే ఉంచాలని చెప్పారు.