
న్యూఢిల్లీ: తమ పిల్లలు వాచ్ మెన్లు కావాలనుకునే వాళ్లు నరేంద్ర మోదీకి ఓట్లు వేయవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమాద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ట్వీట్లో వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు. ‘భారత దేశాన్ని వాచ్ మెన్ల దేశంగా మార్చాలని మోదీ కోరుకుంటు న్నారు. మీ పిల్లలు వారిలో ఒకరు కావాలనుకుంటే, మోదీకి ఓటే యండి. మీ పిల్లలు ఉన్నత చదువులు చదువు కోవాలనీ, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు కావాలని కోరుకుంటే నిజాయితీపరులు, విద్యావంతులున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయండి’ అని విన్నవించారు. రాఫెల్ ఒప్పందం పై తనపై దాడికి దిగిన విపక్షాల్ని అడ్డుకు నేందుకు మోదీ గత వారం ‘మై భీ చౌకీదార్’ పేరుతో ఓ వీడియో ట్వీట్ చేశారు. అ వినీ తికి వ్యతిరేకంగా పోరాడుతూ, దేశ అభివృద్ధి కోసం పాటు పడుతున్న వాళ్లంతా ఈ ప్రచారంలో పాల్గొని, తమను తాము ‘‘కాపలాదారులుగా’’ పిలుచుకోవాలని పిలుపునిచ్చారు. దరిమిలా పలువురు భాజపా నాయకులు ట్విటర్లో తమ పేరుకు ముందు చౌకీదార్ అని చేర్చుకున్నారు.