ఐషే ఘోష్‌ పై కేసు

ఐషే ఘోష్‌ పై కేసు

న్యూ ఢిల్లీ:ఇక్కడి జవాహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయ ఆవరణలో జరిగిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన విద్యా ర్థి  సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ తో పాటు మరో ఎనిమిది మందిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వ విద్యా లయ యాజమార్యం చేసిన ఫిర్యాదు ప్రకారం వారికి వ్యతిరేకంగా ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసారు. తీవ్రంగా గాయపడిన ఆమె తలకు ఐదు కుట్లు పడ్డాయి. ముసుగులు ధరించిన వ్యక్తులు కర్రలు, ఇనుప చువ్వలతో దాడి చేసి ఐషే ఘోష్ సహా 34 మందిని గాయపరచారు. విద్యార్థి వసతి గృహాల రుసుము పెంపును నిరసిస్తూ సర్వర్ రూమ్ లో ఉన్న వస్తు వు లను దోచుకోవడంతో పాటు, గదిలోకి పరికరాలను ధ్వంసం చేశారని ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. గదిలోకి ప్రవేశిం చినపుడు భద్రతా సిబ్బందిపై కూడా కూడా దాడి చేసారని ఆరోపించారు. సెమిస్టర్ రిజిస్ట్రేషన్కు విఘాతం కలిగించేలా సాంకేతిక సిబ్బందిని భయపెట్టారని కూడా అందులో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos