న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా ప్రయాణికులు క్రెడిట్ కార్డులు, పాస్‌పోర్టులు, ఫోన్ నంబర్లతో సహా సమాచారమంతా గత ఫిబ్రవరిలో సైబర్ చోరీ అయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆగస్టు 2011 నుంచి ఫిబ్రవరి 2021 వరకు రిజిస్టర్ అయిన 45 లక్షల ప్రయాణికులు సమాచారం చోరీ అయింది. జెనీవాకు చెందిన ప్యాసింజర్ సిస్టమ్ ఆపరేటర్ (సిటా)లో ఈ చోరీ జరిగింది. ఇందులో పొందుపరిచిన జాతీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల పాస్‌పోర్టుల సమాచారంతో పాటు వినియోగదారుల పేర్లు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ డేటా చోరీకి గురైనట్లు తెలిపింది. ఈ విషయాన్ని వినియోగదారులకు ఇమెయిల్ ద్వారా ఎయిర్ ఇండియా తెలిపింది. క్రెడిట్ కార్డు ద్వారా డేటా లీకయింది. వ్యక్తిగత వివరాలు మాత్రమే తెలుసుకున్నారని వివరించింది. కార్డు వెనకల గల సివివి, సివిసి నంబర్లు డేటాలో లేనందున అవి చోరీ కాలేదు. దర్యాప్తును ప్రారంభమైంది.