డీజే పార్టీ జోష్‌లో ఎయిర్‌ ఇండియా ఉద్యోగులు.. నలుగురిపై వేటు

డీజే పార్టీ జోష్‌లో ఎయిర్‌ ఇండియా ఉద్యోగులు.. నలుగురిపై వేటు

ఢిల్లీ : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయిన ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన నుంచి మతుల కుటుంబాలు, ప్రజలు తేరుకోక ముందే ఎయిర్‌ ఇండియా గ్రౌండ్‌ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంస్థ.. నలుగురు సీనియర్ల ఉద్యోగులపై వేటు వేసింది.సింగపూర్‌ కేంద్రంగా పనిచేసే ఎస్‌ఏటీఎస్‌ లిమిటెడ్‌ ఎయిరిండియా భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఫుడ్‌, బ్యాగేజ్‌ హ్యాండ్లింగ్‌ వంటి గ్రౌండ్‌ సేవలందిస్తోంది. అయితే, గుజరాత్‌లో విమాన దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకే.. గురుగ్రామ్‌లోని ఏఐఎస్‌ఏటీఎస్‌ కార్యాలయ సిబ్బంది ఓ పార్టీ చేసుకున్నారు. సిబ్బందితో కలిసి సీనియర్‌ ఉద్యోగులు కూడా డీజేకు స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos