న్యూ ఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ రకానికి చెందిన ఏఐ 315 విమానం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయల్దేరింది. అయితే మార్గమధ్యలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన పైలట్.. ఈ విషయాన్ని వెంటనే అధికారులకు దృష్టికి చేరవేశారు. అనంతరం విమానాన్ని తిరిగి వెనక్కి మళ్లించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్‌పై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 270 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అదే రకానికి చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం.