న్యూఢిల్లీ: ఇరాక్-ఇరాన్ మధ్య అమెరికా ప్రేరిత యుద్ధం సాగుతున్నందున ఇరాన్ గగన తలంలో సంచరించరాదని భారత ప్రభుత్వం దేశీయ వైమానిక సంస్థల్ని శనివారం కోరింది. దరిమిలా ఎయిరిండియా, ఇండిగో వంటి సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడ్డాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇందువల్ల విమానయాన సంస్థలపై అదనపు భారం పడుతుంది.