న్యూ ఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ పాలనలో ఎయిరిండియాకు నష్టం వాటిల్లేందుకు కారణమయ్యారనే ఆరోపణపై ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరంకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం తాఖీదుల్ని జారీ చేసింది. విచారణకు ఆగస్టు 23న హాజరు కావాలని ఆదేశించింది. 2008-09 మధ్య కాలంలో విదేశీ ప్రయివేటు విమాన సంస్థలైన ఎమిరేట్స్, ఎయిర్అరేబియా, ఖతార్లకు ఎయిర్ స్లాట్స్ కేటాయించడంలో అవకతవకలకు పాల్పడినందుకు ఎయిరిండియాకు భారీగా నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. దరిమిలా ఆయనకు వ్యతిరేకంగా నగదు బదిలీ కేసు దాఖలు చేసారు. అప్పుడు ప్రఫుల్ పటేల్ విమాన యాన శాఖ మంత్రి కాగా చిదంబరం ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రఫుల్ పటేల్ను ఈడీ ప్రశ్నించింది. తాజాగా చిదంబరంకు కూడా సమన్లు జారీ చేశారు.