కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్

కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్

న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లను మూసి వేశారు. అకౌంట్లు సీజ్ చేసిన విషయాన్ని ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ వెల్లడించారు. ఎన్నికల బాండ్లను సుప్రీం కోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ బాండ్లు రాజ్యాంగ విరుద్దమని కోర్టు తెలిపింది. సుప్రీం తీర్పుతో రాజకీయ పార్టీలకు ఫండింగ్ నిలిచి పోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. తాము ఇచ్చే చెక్కులను బ్యాంక్లు తీసుకోవడంలేదని తమకు సమాచారం అందినట్లు కాంగ్రెస్ నేత మాకెన్ తెలిపారు. యూత్ కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను ప్రభుత్వం సీజ్ చేసినట్లు మాకెన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు కూడా సీజ్ అయ్యాయన్నారు. యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నుంచి 210 కోట్లు రికవరీ చేసేందుకు ఆదాయ పన్ను శాఖ అడుగుతున్నట్లు చెప్పారు. ఎన్నికలకు రెండు వారాల ముందే విపక్షాల అకౌంట్లను సీజ్ చేశారని, ఇది ప్రజాస్వామ్యాన్ని సీజ్ చేసినట్లే అని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం తమ వద్ద డబ్బు లేదని, విద్యుత్తు బిల్లు, ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు అమౌంట్ లేదన్నారు. అన్నింటి పైనా ప్రభావం పడుతుందని, రాహుల్ గాంధీ న్యాయ యాత్రతో పాటు రాజకీయ కార్యక్రమాలపై ప్రభావం పడుతుందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos