న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక లో రిగ్గింగ్ జరిగిందని అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్ ఆరోపించారు. ‘ఉత్తరప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగా చాలా అవకతవకలు జరిగాయి. ఓట్ల లెక్కింపులో యూపీ ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్ద’ని ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మిస్త్రీకి రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు శశిథరూర్ తెలిపారు. మిస్త్రీ కార్యాల యంతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నట్లు శశిథరూర్ తరఫున ఎలక్షన్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ సజ్ పేర్కొన్నారు. పోలింగ్ లో జరిగిన అవకతవకలపై మిస్త్రీ గమనానికి తీసుకెళ్లినట్లు వివరించారు.ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 3 గంటలకు పూర్తయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 9500 . ఏఐసీసీ కార్యాలయంలో ఏడు నుంచి ఎనిమిది టేబుల్స్ పై కౌంటింగ్ జరుగుతోంది. . ప్రతీ టేబుల్ లోనూ ఇద్దరు ఓట్లు లెక్కిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారని సమాచారం.