వైరల్‌గా మారిన సాయి పల్లవి వీడియో..

  • In Film
  • December 27, 2019
  • 199 Views
వైరల్‌గా మారిన సాయి పల్లవి వీడియో..

ఫిదా బ్లాక్‌బస్టర్‌ అనంతరం రెండేళ్లపాటు విరామం తీసుకున్న దర్శకుడు శేఖర్‌ కమ్ముల మరోసారి అందమైన ప్రేమకథతోనే ప్రయోగం చేయబోతోన్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి, నాగ చైతన్యలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న మూవీ షూటింగ్ కూడా చకచకా జరిగిపోతోంది. క్రమంలోనే రియలిస్టిక్గా ఉండాలని ప్రయోగం కూడా చేశాడు.సన్నివేశం సహజంగా ఉండాలని, రియలిస్టిక్ ఫీలింగ్ తీసుకువచ్చేందుకు జనం తిరిగే ప్రదేశాల్లోనే సీన్ తీయాలని శేఖర్ కమ్ముల అనుకున్నాడట. దీని కోసం నగరంలోని పద్మారావ్ నగర్ను ఎంచుకున్నాడు. రోడ్డుపై నడుస్తూ.. ఇంట్లోకి సాయి పల్లవి వెళ్లే సీన్ అది. అయితే వారు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి.రోడ్డుపై సాయి పల్లవిని చూసిన అభిమానులు ఊరికే ఉంటారా.. సీన్స్ను తమ ఫోన్లో బంధించారు. రోడ్డుపై నడుస్తూ గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోకి వెళ్లే సీన్ కాస్త.. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.దీంతో ఈ వీడీయో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా దీనిపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos