అమెరికాకు లొంగితే వ్యవసాయానికి ఉరితాడే

అమెరికాకు లొంగితే వ్యవసాయానికి ఉరితాడే

న్యూఢిల్లీ : అమెరికా ఒత్తిడితో టారిఫ్‌లను అంగీకరిస్తే దేశ వ్యవసాయ రంగానికి ఉరితాడే అవుతోందని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు విమర్శించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం చరిత్రపై రైతు నేత, మాజీ ఎంపి హన్నన్‌ మొల్లా రాసిన పుస్తకాన్ని గురువారం రైతు సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. రచయితతో కలిసి పుస్తకాన్ని ఎఐకెఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ దావలే, విజూ కృష్ణన్‌, వ్యవసాయ కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌, సహాయ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌, సిఐటియు కార్యదర్శి సాయిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ నేత ఆదర్శ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమెరికా టారిఫ్‌లు పెంచేది, తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా భారత్‌తో ఒప్పందాలు చేసుకోవడం కోసమేనని, ఈ విషయాన్ని ట్రాంప్‌ బహిరంగంగా ప్రకటించారని తెలిపారు. మోడీ ప్రభుత్వం లొంగితే దేశ వ్యవసాయ రంగం విచ్ఛిన్నం అవుతుందని హెచ్చరించారు. మన ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు గోధుమ, డైరీ సర్వనాశనం అవుతాయని, వరి పంటను కంపెనీలు నియంత్రిస్తాయని, . ఆహార భద్రతకు పెను ముప్పు పొంచి ఉందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతిస్తే మన సహజ వనరులను దోసుకోవచ్చని సామ్రాజ్యవాదులు కుట్రలని విమర్శించారు. ఇదే జరిగితే మన దేశం నయా వలస వాదానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి టారిఎఫ్‌కు అంగీకరించకుండా ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించాలని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం చరిత్రను రచించిన హన్నన్‌ మొల్లాను అందరూ అభినందించారు. మహాసభల సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు ఎంతో అద్భుతంగా వివరించారని తెలిపారు. ఈ ఆవిష్కన సభలో ప్రజా సంఘాల నేతలు మజుందార్‌, ఇంద్రజిత్‌, బాదల్‌, పాండ్యన్‌, విమల్‌ పలివాల్‌, బాబు, మనోజ్‌, త్యాగి తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos