ముజాఫర్‌నగర్ : ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్‌కు ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక జడ్జి దేవేంద్ర సింగ్ ఫౌజ్దార్ గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సెప్టెంబర్ 13వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. అనుమతి లేకుండా జనవరి 11వ తేదీన రామ్‌లీలా టీలా లో ఎన్నికల మీటింగ్‌ను ఏర్పాటు చేసిన ఘటనలో మంత్రి అగర్వాల్‌తో పాటు మరికొంత మందిపై కేసు దాఖలైంది.