అహ్మదాబాద్: ఇక్కడి ఎయిర్‌పోర్టు సమీపంలో ఎయిర్ఇండియా విమానం కూలిపోయింది. విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు.. విమాన పైలెట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్‌కు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉన్నట్లు తెలిపారు. ఎయిర్ఇండియా B787 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఘటన జరిగింది. అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతానికి సమీపంలోని ధార్పూర్ వద్ద ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం విమానం నుంచి భారీ పొగలు రావడంతో అటు ఎయిర్ఇండియా, ఇటు ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టాయి.