మసీదు లౌడ్‌స్పీకర్ల ఇలా వాడండి

మసీదు లౌడ్‌స్పీకర్ల ఇలా వాడండి

ముంబై : మసీదుల్లోని లౌడ్స్పీకర్లను తొలగించడానికి బదులు, పెరుగుతున్న ధరల గురించి మాట్లాడటానికి వాటిని ఉపయోగించాలని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే సూచించారు.మరాఠీల ఉగాది పండుగ మే 3 కల్లా మసీదుల్లోని లౌడ్స్పీకర్లను తొలగింక పోతే అక్కడ హనుమాన్ చాలీసా చదువుతామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే చేసిన హెచ్చరికకు ఈ మేరకు స్పందించారు. ‘మసీదుల్లోని లౌడ్స్పీకర్లను తొలగించడానికి బదులు ద్రవ్యోల్బణం, పెట్రోలు, డీజిల్, సీఎన్జీ ధరల పెరుగుదల గురించి వివరించడానికి ఉపయోగించాలి. గడచిన 60 ఏళ్ళ సమాచారాన్ని కాకుండా, ఇటీవలి రెండు, మూడేళ్ళ గణాంకాలను పరిశీలించాలి. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ఎవరినీ అనుమతించం’అన్నారు. శివసేన లోక్సభ సభ్యుడు సంజయ్ రౌత్ కూడా మాట్లాడారు. ‘లౌడ్స్పీకర్ల నుంచి వెలువడే శబ్ద తీవ్రత నియంత్రణకు నిబంధనలు ఉన్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ మాట్లాడుతూ, రాజ్ థాకరేకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ మాట్లాడుతూ, రాజ్ థాకరే బీజేపీ తరపున పని చేస్తున్నారని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos