రూ.యాభై లక్షల ఆడి ఎ6 సెడాన్ విడుదల

రూ.యాభై లక్షల ఆడి ఎ6 సెడాన్ విడుదల

దిల్లీ:ఆడి సరికొత్త కారు-ఆడి ఎ6 సెడాన్ లైఫ్స్టైల్ను మంగళ వారం దేశీయ విపణిలోకి విడుద లైంది. ఆడీ ఎ6 కారుకు కొత్త హంగుల్ని జోడించి నూతన కారును ప్రవేశపెట్టింది.రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్, మొబైల్ కాఫీ మెషీన్ -ఎస్ప్రెస్సోం మొబిల్, ఎంట్రీ, ఎగ్జిట్ లైట్స్ తదితర హంగులు కొత్త కారుకు ఉన్నాయి.వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణీకులకు 25.65 సెం.మీల తాకే తెర కలిగిన టాబ్లెట్ వినోదాన్ని అందిస్తుంది. ఈ టాబ్లెట్ బయట కూడా పని చేస్తుంది.ఎ6 సెడాన్ 1.8 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, రెండు లీటర్ల డీజిల్ ఇంజిన్ రకాల్లో లభిస్తుంది.‘ఆడిఏ 6 సెడాన్’ధర రూ.49.99 లక్షలు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos