వేరే పార్టీ పెట్టుకోండి

వేరే పార్టీ పెట్టుకోండి

న్యూ ఢిల్లీ : ‘ఎవరైతే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారో వారు ఇతర పార్టీల్లో చేరిపోవచ్చ’ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి బుధవారం ట్విట్టర్ లోమండి పడ్డారు. ‘ప్రతిసారీ ఇబ్బందికర వ్యాఖ్యలు చేసే బదులు. కొత్త పార్టీలో చేరవచ్చు. లేదా వారే ఒక కొత్త పార్టీని స్థాపిస్తే బాగుంటుంది. కాంగ్రెస్పై ప్రతిరోజూ విమర్శలు చేసే వారు గాంధీ కుటుంబానికి, అధిష్ఠానానికి బాగా దగ్గరి వ్యక్తులు. ఏవైనా సమస్యలుంటే వారు నేరుగా అధిష్ఠానం ముఖ్యులతో సంప్రదిస్తే బాగుంటుంది. తమకు కాంగ్రెస్ సరైన పార్టీ కాదని కొందరు అనుకుంటున్నారు. అలాంటి వారు నచ్చిన విధానంలో పార్టీని నెలకొల్పుకోవచ్చు. అంతేగానీ పార్టీకి ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించవద్దు. అలా చేయడం ద్వారా పార్టీ విశ్వసనీయత పలచబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు నింపాలని ఆ నేతలు మనస్ఫూర్తిగా భావిస్తే కార్యక్షేత్రంలో దిగి, పార్టీకి జవసత్వాలు నింపాల’ని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos