చిరునామాలకూ డిజిటల్ పిన్ కోడ్ లు

చిరునామాలకూ  డిజిటల్ పిన్ కోడ్ లు

న్యూ ఢిల్లీ: కొన్ని ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల అనుమతి లేకుండా వారి చిరునామా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేయటాన్ని నివారించేందుకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థకు భౌతిక చిరునామాలను కూడా జోడింపునకు  తపాలా శాఖ సన్నద్ధమవుతోంది. సంబంధిత ముసాయిదాను  త్వరలోనే ప్రజల సంప్రదింపుల కోసం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా కొత్త వ్యవస్థ తుది రూపు దాల్చే అవకాశం ఉంది. దీనిపర్యవేక్షణకుఒక ప్రాధికార ఏర్పాటునకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ముసాయిదాను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.దీని ప్రకారం డిజిపిన్ (డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్) కచ్చితమైన మ్యాప్ కోఆర్డినేటర్ల ఆధారంగా ప్రతి చిరునామాకు విశిష్టమైన పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఇస్తారు. పెద్ద ప్రాంతాలను కవర్ చేసే సాంప్రదాయ పిన్ కోడ్ మాదిరిగా కాకుండా డిజిపిన్‌లు వ్యక్తిగత గృహాలు లేదా వ్యాపార సంస్థలకు స్పష్టమైన కచ్చితత్వాన్ని అందిస్తాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos