నెల్లూరు : లోక్‌సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి దంపతులు తమ వివాహ దినోత్సవం సంద ఇక్కడి విశ్వభారతి అంధుల పాఠశాలకు రూ.లక్ష విరాళం అందించారు. వారి తరఫున విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి మంగళవారం పాఠశాల కరస్పాండెంట్ కు ఆ నగదు అందించారు. ఆదాల భార్య వింధ్యావళి తో కరెస్పాండెంట్ ఫోనులో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి వెంట మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, పాముల హరి, ఇక్బాల్, అవినాష్, నరసింహారావు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాం త్ కూడా ఉన్నారు