నెల్లూరు: నల్లమల అటవీ ప్రాంతం నదీ పరివాహక ప్రాంతానికి అరకిలోమీటరు దూరంలో మైనింగ్ కు అనుమతించలేదని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి బాబుల్ సుప్రియో లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్ర వారం అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. మైనింగ్ వల్ల అటవీ ప్రాంతానికి, అక్కడి గిరిజనులకూ నష్టం వాటిల్లుతోందని ప్రభాకర రెడ్డి వివరించారు. నది కలుషితమవుతోందనీ పేర్కొన్నారు . గిరిజనుల జీవించే హక్కుకూ భంగం కలుగుతోందన్నారు.