వికలాంగ క్రీడాకారులకు ఆదాల సన్మానం

వికలాంగ క్రీడాకారులకు ఆదాల సన్మానం

నెల్లూరు : జాతీయస్థాయిలో స్పోర్ట్స్, గేమ్స్ లో ప్రతిభ చూపిన వికలాంగ క్రీడాకారుల ను లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం సన్మానించారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వి.భవాని (అథ్లెటిక్స్) వి. రామ్ తేజ (అథ్లెటిక్స్) చరిత్ (స్విమ్మింగ్) టి. సురేష్ (అథ్లెటిక్స్) లను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు రైల్వేలో ఉద్యోగాలకు సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారు. విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, మైపాడు అల్లాబక్షులను క్రీడాకారులు సన్మానించారు. జిల్లా పారా స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షులు మాల్యాద్రి నాయుడు, ప్రధాన కార్యదర్శి కటారి యాదగిరి, సలహాదారు మైపాడు అల్లాబక్షు, మధు తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos