టబు సింగిల్‌గా ఉండిపోవడానికి కారణమిదే..

  • In Film
  • May 25, 2020
  • 195 Views
టబు సింగిల్‌గా ఉండిపోవడానికి కారణమిదే..

కూలి నెం.1 చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన టబు 90వ దశకంలో తెలుగుతో పాటు హిందీలో సైతం క్రేజీ హీరోయిన్‌గా వెలుగుగొందింది.తెలుగుతో పాటు బాలీవుడ్‌లో సైతం అగ్రహీరోలతో ఆడిపాడింది.ఇక ప్రేమదేశంతో చిత్రంతో టబు అప్పటియువతరానికి కలలరాణిగా క్రేజ్‌ తెచ్చుకుంది.అటుపై కొత్త హీరోయిన్ల రాక పోటెత్తడంతో మెల్లిగా ఇతర పాత్రల్లో నటించడం మొదలుపెట్టింది.ఇదిలా ఉంటే 47 ఏళ్ల వయసు వచ్చినా టబు ఇప్పటికీ సింగిల్‌గా ఉండిపోవడం వెనుక రెండుసార్లు ప్రేమ విఫలం కావడమేనని అందుకే టబు పెళ్లికి దూరంగా ఉండిపోయిందట. టబు అప్పట్లో ఒక టాలీవుడ్ స్టార్ హీరోను ప్రేమించి.. పెళ్లికి కూడా సిద్దమైనట్లు కథనాలు కూడా వచ్చాయి. స్టార్ హీరోను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన రోజున ఊహించని విధంగా స్టార్ హీరో కుటుంబ సభ్యులు వారి వివాహాన్ని చెడగొట్టినట్లు అప్పట్లో అనేక రూమర్స్ వచ్చాయి. అయితే తరువాత హీరో మరో పెళ్లి చేసుకోవడంతో దాదాపు టబు టాలీవుడ్ కి దూరమయ్యింది. బాలీవుడ్ లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళ్లిన టబుకి అక్కడ మంచి క్రేజ్ దక్కింది. కానీ అక్కడ కూడా మరొక స్టార్ హీరోను ప్రేమించిన టబు పెళ్లి చేసుకోవాలని అనుకుందట. కానీ అక్కడ కూడా మళ్ళీ టబుకి చేదు అనుభవమే ఎదురైందట. బాధ నుంచి కొలుకోవడానికి కూడా బ్యూటీకి చాలా సమయం పట్టిందట

తాజా సమాచారం

Latest Posts

Featured Videos