
వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక పలు తెలుగు,తమిళ,కన్నడ చిత్రాల్లో నటించిన శాండల్‌ఉడ్ నటీమణి విజయలక్ష్మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.తెలుగు,తమిళం,కన్నడ,మలయాళ భాషల్లో సుమారు 40 చిత్రాల్లో నటించిన విజయలక్ష్మీ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం పలు ధారావాహికల్లో నటిస్తున్న విజయలక్ష్మీ నీరసం,బీపీతో బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.కొద్ది కాలం క్రితం తమ తల్లికి వైద్యం చేయించడానికి విజయలక్ష్మీ పెద్దమొత్తంలో ఖర్చు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి.అదే సమయంలో విజయలక్ష్మీ అనారోగ్యానికి గురి కావడంతో వైద్యం చేయించడానికి డబ్బులు లేవని చికిత్స పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం ఉందని దీంతో తమ సోదరిని ఆదుకోవాలంటూ విజయలక్ష్మీ చెల్లెలు ఉపాదేవి కన్నడ చిత్ర పరిశ్రమ నటీనటులు,అభిమానులకు విన్నవించారు.చిత్రాలు,ధారావాహికల్లో కూడా అవకాశాలు పూర్తగా తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరమయ్యాయని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.విజయలక్ష్మీ తెలుగులో హనుమాన్ జంక్షన్,పృధ్వీనారాయణ చిత్రాల్లో నటించారు..