గజిని సినిమాలో నటించడం చెత్త నిర్ణయం..

  • In Film
  • May 9, 2019
  • 178 Views
గజిని సినిమాలో నటించడం చెత్త నిర్ణయం..

ఎంతపెద్ద స్టార్లయినా కెరీర్ ఆరంభంలో కథల ఎంపికలో తప్పకుండా తప్పులు చేస్తుంటారు.సినిమా కెరీర్లో భవిష్యత్తు కోసం కెరీర్ ఆరంభంలో కథల ఎంపికలో పొరపాట్ల వల్ల సినిమాలు విడుదలయ్యాక ఈ కేరక్టర్ అనవసరంగా చేశామని చింతిస్తుంటారు.అందుకు లేడీ సూపర్స్టార్ నయనతార కూడా మినహాంపేమి కాదు.ఇటీవల ఓ ఇవటర్వ్యూలో నయనతార పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.అందులో భాగంగా కెరీర్ ఆరంభంలో సూర్య,మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన గజినిలో సెకండ్ హీరోయిన్ పాత్ర చేయడం తన కెరీర్ లో ఒక చెత్త నిర్ణయం అని చెప్పారు.ఆ సినిమాలో తను పోషించిన చిత్ర పాత్ర గురించి మాట్లాడుతూ “నాకు నెరేషన్ ఇచ్చిన చిత్ర పాత్రకు స్క్రీన్ పై కనిపించిన పాత్రకు చాలా డిఫరెన్స్ ఉంది” అంటూ ఆరోపించారు. ‘చంద్రముఖి’ లో చేసింది కూడా చిన్న పాత్ర అయినప్పటికీ తనకు మంచి పేరు తీసుకొచ్చిందని.. మొదట్లో ఆ పాత్ర స్వీకరించేందుకు తటపటాయించానని తెలిపారు. అదే సమయంలో విజయ్ సినిమా ‘శివకాశి’ లో కూడా ఒక సాంగ్ మాత్రమే చేసినప్పటికీ అది కూడా తనకుమంచి గుర్తింపు తీసుకొచ్చిందని తెలిపారు. ‘గజినీ’ ఎక్స్ పీరియన్స్ తర్వాత తన పాత్రల ఎంపిక పట్ల జాగ్రత్త పడ్డానని తెలిపారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos