ఆ మాట విన్నాక కాలిపోయింది..

ఆ మాట విన్నాక కాలిపోయింది..

సినిమాల్లో కంటే రాజకీయాల్లో చేరి వివాదాస్పద వ్యాఖ్యలు,ట్వీట్లతోనే ఎక్కువ పాపులారిటీ దక్కించుకున్న సినీనటి,బీజేపీ మహిళ నేత మాధవీలత మరోసారి ట్విట్టర్‌ ఖాతాలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడిపై విమర్శలు గుప్పించారు. నాతో ఓ పెద్ద మనిషి ఒక మహానుభావుడు ఒక రాజకీయ నాయకుడు అన్న మాట.ఆర్మీ వాడైతే బోర్డర్ లో వెళ్లి డ్యూటీ చేస్కోమను, సమాజం లో ఎం జరిగితే వీడికెందుకు ?, రాజకేయం మీద కామెంట్ చేసే హక్కు వీడికి ఏముంది ?? “ఎదో వీళ్ళే పెద్ద దేశాన్ని ఉద్ధరిస్తునట్లు.ఈ మాట విని కడుపు కాలింది , ఆవేశం వచ్చింది , కానీ ఏమి చేయలేను అధికారంలో ఉన్న నాయకుడు. గట్టిగ అనుకున్న తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలతన్నే వాడు పుడతాడు అని ఆ రోజు వాడిది రేపు నాది అనుకున్నా.దేశాన్ని ఉద్దరించేది కాపాడేది ఇండియన్ ఆర్మీ ఒకటే. ఇది ఎప్పటికైనా ఆ నాయకుడికి తెలియచెప్పాలి అనే కసి తో ఉన్నా దేనికైనా సమయం రావాలి మిత్రమా.మన కోసం ప్రాణాలు అర్పించేవారికోసం మనం మనుషులుగా బతకాలి అని ట్వీట్‌ చేశారు.అయితే ఆ నాయకుడి పేరు మాత్రం వెల్లడించలేదు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos