బాధతోనే పెళ్లి చేసుకున్నా..

  • In Film
  • March 7, 2019
  • 159 Views
బాధతోనే పెళ్లి చేసుకున్నా..

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వివిధ పాత్రల్లో పలు సినిమాల్లో నటించిన జ్యోతికి తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్తరు గుర్తింపు ఉంది.బిగ్‌బాస్‌ తెలుగు మొదటి సీజన్‌లో పాల్గొన్న జ్యోతి బిగ్‌బాస్‌తో తన పాపులారిటీని మరి కొంత పెంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్‌వ్యూలో తన వ్యక్తిగత విషయాలను జ్యోతి పంచుకున్నారు. కెరీర్‌ ఆరంభంలో తెలిసీ తెలియని వయసులో ఆకర్షణకు లోనై అదే ప్రేమగా భావించి చాలా తప్పులు చేశానన్నారు.తన మొదటి ప్రేమ విఫలమైందనే బాధ,కసి ఉన్న సమయంలో తన మాజీ భర్తతో ఓ ఈవెంట్‌లో పరిచయం ఏర్పడిందన్నారు.అతడు కూడా నిజాయితీగా ఉన్నట్లు అనిపించడంతో వెంటనే పెళ్లి చేసుకున్నామన్నారు.అయితే అది ఎంత తప్పో తర్వాత రోజుల్లో తెలిసోచ్చిందన్నారు.పెళ్లయిన కొద్ది రోజులకు ఇద్దరికి అన్నింట్లోనే అభిప్రాయ బేధాలు,మనస్పర్ధలు తలెత్తాయని దీంతో తరచూ గొడవ పడుతుండేవాళ్లమన్నారు.ఈ పరిణామాలతో ఇద్దరం విడిపోయామన్నారు.ప్రస్తుతం తన కొడుకుతో జీవితం సాఫిగా సాగుతోందని తన జీవితానికి తన కొడుకు ఒక్కడు చాలన్నారు.అవకాశం వస్తే తన కొడుకును కూడా చిత్ర పరిశ్రమలోకి తీసుకువస్తామన్నారు.ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో కృష్ణవంశీ తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos