భోపాల్ : మహా కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా …. ప్రమాదం జరిగి ఎపి వాసులు ఏడుగురు మృతి చెందిన దుర్ఘటన మంగళవారం మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సిహౌరా దగ్గర హైవేపై ఓ మినీ బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా ఏపీకి చెందినవాళ్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.