చిత్తూరు జిల్లా వి.కోట మండలం దాసర్లపల్లి వద్ద జరిగిన రోడ్డు
ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మద్దిరాల గ్రామానికి చెందిన శంకరప్ప(52), దానమయ్యగారిపల్లికి చెందిన గోవిందప్ప(48), కొడగల్లుకు చెందిన గంగప్ప(44) ద్విచక్ర వాహనంపై వి.కోటకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
బారికేడ్లను అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న టెంపోను ఢీ కొనడంతో ముగ్గురూ అక్కడికక్కడే
మరణించారు. శంకరప్ప కృష్ణాపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేసే వారు.