న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట సవరణను అత్యున్నత న్యాయ స్ధానం సమర్థించింది. సవరణ రాజ్యాంగ బద్ధ మైందని స్పస్టీకరించింది. ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు దాఖలుకు ముందు ప్రాథమిక దర్యాప్తు తప్పనిసరి కాదని అత్యున్నత న్యాయస్థానం సోమవారం తేల్చిచెప్పింది. ఎఫ్ఐఆర్ నమోదుకు సీనియర్ పోలీస్ అధికారి అనుమతి అవసరం లేదని, ముందస్తు బెయిల్కు అవకాశం కల్పించకూడదని చట్టాన్ని సవరించారు. ప్రత్యేక పరిస్ధితుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం ఉండేలావెసులుబాటు కల్పించారు. ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయరాదని దేశ వ్యాప్తంగా ఆందోళన వెల్లు వెత్తడంతో ఆ చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలతో పదును బెట్టింది.