అమరావతి:నిఘా విభాగం మాజీ అధిపతి ఏబీ.వెంకటేశ్వర రావుకు ఎదురు దెబ్బ తగిలింది. తనపై విధించిన సస్పెన్షన్ ను రద్దు చేయాలని ఆయన చేసిన వినతిని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) తిరస్కరించింది. ‘భద్రతా ఉపకరణాల కొనుగోళ్లలో సేవా నిబంధనలను అతి క్రమించినందున ప్రజాప్రయోజనాల రీత్యా విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు’ ప్రభుత్వం తెలిపింది. దీన్ని ఆయన క్యాట్ లో సవాల్ చేసారు.