చంద్రగిరి: మద్యాన్ని ఆదాయ వనరుగా పరిగణించటం లేదని ఆబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. శనివారం ఇక్కడ శిక్షణ పొందిన 42 మంది ఎక్సైజ్ పోలీసులకు ధ్రువ పత్రాలు వితరణ చేసిన తర్వాత ప్రసంగించారు. రాష్ట్రంలో తొలి దశలో మద్యం గొలుసు దుకాణాలను పూర్తిగా నిర్మూలించి వాటి ని ర్వాహకులకు వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామన్నారు. మద్యానికి బానిసలై భర్తలను పోగొట్టుకొన్న మహిళల ఆవేదన అంతింతా కాదన్నారు. నవరత్నాలు హామీ ప్రకారం మద్యపానాన్ని అంచెలంచెలుగా నిషేధిస్తామన్నారు. పలమనేరులో జరిగిన పరువు హత్యను ఖండించారు. కేసును వేగంగా దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.