ఇస్లామాబాద్: శతృవుల్ని కూడా మిత్రులు కూడా మార్చే శక్తి గల తేనీరు సేవించాలనుకుంటున్నారా? వెంటనే పాక్‌లోని కరాచీ నగరాకి వెళ్లాల్సిందే.అక్కడి తేనీటి వ్యాపారి తన దుకాణం వద్ద తేనీరు తాగుతున్న భారతీయ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ చిత్రాన్ని నిలిపారు. దాని శీర్షికగా ‘మిత్రులుగా మార్చే టీ ఇక్కడ దొరుకుతుంది’ అని రాయించాడు. దరిమిలా ఆయన చుట్టుపక్కల చాలా ప్రఖ్యాతి చెందుతున్నారు. వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది.సంబంధిత ఫోటోల్ని ఒమర్ ఫరూఖ్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో ఎక్కించారు. ‘ఈ అంకుల్ వ్యాపార నైపుణ్యాలను చూడండి. రోడ్డు పక్కన ఆయనకు చెందిన టీ దుకాణం ఉంది. దానికి ఖాన్ టీ స్టాల్ అని పేరు ఉంది. ఐఏఎఫ్ పైలట్ అభినందన్ ఫొటోను పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘ఇలా కూడా ఫేమస్ కావచ్చా?’ అని మరి కొందరు పేర్కొంటున్నారు. ఎన్నికల్లో అభినందన్ ఛాయా చిత్రాల వినియోగాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిషేధించింది. అయితే పాక్‌లో మాత్రం ఆయన ఫోటో వాణిజ్య ప్రచారానికి సాధనమైంది.