బెంగాలి దుస్తుల్లో నోబెల్‌ అందుకున్న అభిజిత్‌ దంపతులు

బెంగాలి దుస్తుల్లో నోబెల్‌ అందుకున్న అభిజిత్‌ దంపతులు

స్టాక్హోం: అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి విజేత అభిజిత్ బెనర్జీ , ఆయన భార్య ఎస్తర్ డుఫ్లో బెంగాలి సంప్రదాయ దుస్తుల్ని ధరించి మంగళవారం ఇక్కడ జరిగిన ఉత్సవంలో స్వీడన్ రాజు గుస్టాఫ్ నుంచి పురస్కారాన్ని గ్రహించారు. దరిమిలా మరోసారి దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసే పనిచేశారు. దేశాన్ని వదలి ఏళ్లు గడిచినా బెంగాలి సంప్రదాయాన్ని ఏమాత్రం మరువ లేదు. ధోతి, బంద్గలా సూట్లో అభిజిత్, అచ్చు భారత చీరకట్టు, బొట్టుతో ఎస్తర్ సంస్కృతిని ప్రపంచానికి చాటారు. పురస్కా రా న్ని అందుకున్న తర్వాత వేడుకకు హాజరైన వారందరికీ నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకకు భారత్ నుంచి ఆ య న కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. పేదరికపు కోరల నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించేలా తన అధ్యయనం ద్వారా అద్భుత పరిష్కారాలను సూచించినందుకుగానూ అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డుఫ్లో, మరో ఆర్థిక శాస్త్ర వేత్త మైఖెల్ క్రెమర్కు నోబెల్ పురస్కారం లభించిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos