ఢిల్లీ ‘శీష్ మహల్‌’పై విచారణ

ఢిల్లీ ‘శీష్ మహల్‌’పై విచారణ

ఢిల్లీ: ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘శీష్‌ మహల్‌’  వ్యవహారం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు శీష్ మహల్ పునరుద్ధరణలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాపై వస్తున్న ఆరోపణలపై విచారణకు ఆదేశించింది . కేంద్ర ప్రజాపనుల విభాగం నివేదిక సమర్పించిన తర్వాత ఫిబ్రవరి 13న సమగ్ర విచారణకు ఆదేశించింది. 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లో 40 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా ఆధునీకరణ కోసం నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వివరణాత్మక నివేదిక తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎంగా పని చేసిన సమయంలో సివిల్‌ లైన్స్‌లో ఆయన అధికారిక నివాసం ఏర్పరుచుకున్నారు. అయితే, ఆ నివాసాన్ని బీజేపీ ‘శీష్‌ మహల్‌’గా అభివర్ణిస్తోంది. ఢిల్లీ సీఎం అధికార నివాసాన్ని దాదాపు రూ.80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు ఆరోపిస్తోంది. ఆధునీకరణంలో భాగంగా టాయిలెట్‌లో గోల్డెన్‌ కమోడ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, మినీ బార్‌ వంటివి ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ బంగ్లాను పునరుద్ధరించడంలో పెద్ద స్కామ్‌ జరిగిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos