ప్రతిపక్షాలు బలంగా ఉన్న చోట ఓటింగ్‌ ప్రక్రియను మందగించాలని ఎల్జీ ఆదేశించారు

ప్రతిపక్షాలు బలంగా ఉన్న చోట ఓటింగ్‌ ప్రక్రియను మందగించాలని ఎల్జీ ఆదేశించారు

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి అతిషి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాను విమర్శించారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుపాలని పోలీసులను ఆయన ఆదేశించినట్లు ఆరోపించారు. శనివారం ఆరో దశ పోలింగ్ సందర్భంగా ఢిల్లీ మంత్రి అతిషి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓటింగ్ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతున్నదని దుయ్యబట్టారు. ‘గత సాయంత్రం ఢిల్లీ పోలీస్ అధికారులను సమావేశానికి ఎల్జీ పిలిచినట్లు మాకు అధికారిక సమాచారం అందింది. భారత కూటమి బలమైన ప్రాంతాలలో ఓటింగ్ మందగించాలని ఢిల్లీ పోలీసులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలను ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి ఎన్నికల సంఘం దీనిని పరిగణలోకి తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం’ అని అన్నారు., మంత్రి అతిషి ఆరోపణలను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఖండించారు. మంత్రిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగ అధికారానికి వ్యతిరేకంగా, ఎన్నికల సందర్భంగా ఇలాంటి అసమంజస ప్రకటనలు చేయడం తప్పని అన్నారు. ఓటర్లను తప్పుదోవ పట్టించడం, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్జీ సక్సేనా హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos