న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల్లో అధికారం, పలు రాష్ట్రాల్లో ఉనికిని చాటుకుని జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. డీడీయూ మార్గ్లోని ఆప్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎన్నికల ప్రచారాన్ని పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీగా ఆప్ ఇప్పటికే కాంగ్రెస్తో ఢిల్లీ, గుజరాత్, హర్యానాలో పొత్తులు ఖరారు చేసింది.