శత్రు దేశం దాడికి వస్తోందా?

శత్రు దేశం దాడికి వస్తోందా?

న్యూ ఢిల్లీ: రైతులు నిరసన చేస్తున్న ఘజీపూర్ ప్రదేశంలో చేసిన భారీ భద్రతా ఏర్పాట్లు శత్రు దేశం దాడిని ఎదుర్కొనే రీతిలో ఉన్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. రిపబ్లిక్డే హింసా ఘటనలకు సంబంధించి మాజీ సైనికోద్యోగులు, రైతుల సహా ఇంతవరకూ 122 మందిని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. ‘వాళ్లు ఈ దేశ రైతులు, శత్రువులు కాదు. వారిని ప్రభుత్వం దేశద్రోహులుగా, సంఘ వ్యతిరేకులుగా చిత్రీకరించింది. మూడు నల్ల చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంటులో చర్చ జరపాలి’ అని డిమాండు చేసారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన మంగళవారంతో 69వ రోజుకు చేసింది. నిరసన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపి వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos