హైదరాబాద్‌లో మరో దారుణం..

హైదరాబాద్‌లో మరో దారుణం..

భాగ్యనగరం హైదరాబాద్‌ నగరంలో కొద్ది కాలంగా పెరుగుతున్న నేరాలు చూస్తుంటే హైదరాబాద్‌ నగరం నేరాలకు రాజధానిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.తాజాగా హోళి పండుగ రోజున ఓ కిరాతకుడు చేసిన పనికి హైదరాబాద్‌ నగరం మరోసారి ఉలిక్కిపడింది.ఆరేళ చిన్నారిపై ఓ కామాంధుడు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనతో పోలీసులను సైతం నివ్వెరపరచింది.మెదక్‌ జిల్లాకు చెందిన దంపతులు కొద్ది కాలం క్రితం నగరంలోని అల్వాల్‌కు వచ్చి ఇక్కడే పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.భర్త స్థానికంగా ఉన్న డైరీలో పని చేస్తుండగా భార్య ఇళ్లల్లో పనులు చేస్తోంది.హోళి పండుగ రోజైన గురువారం కూడా భార్యభర్తలు పనులకు వెళ్లగా దంపతుల కొడుకు(7), కూతురు(6)లు హోళి పండుగ సందర్భంగా స్నేహితులతో రంగులు చల్లుకుంటూ ఆడుకుంటున్నారు.అదే సమయంలో అక్కడే అద్దెకు నివసిస్తున్న బిహార్‌ రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర అనే యువకుడి గదికి అదే రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర స్నేహితులు నిందితుడు రాజేశ్‌తో పాటు రోషన్‌, సురేంద్ర, సురేందర్‌, సుబ్రహ్మణ్యంలు వచ్చి మద్యం తాగి హోళి జరుపుకొన్నారు.ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న బాలికపై కన్నేసిన రాజేశ్‌ రంగులు కొనిస్తానంటూ బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. భయపడ్డ బాలిక గట్టిగా కేకలు వేయగా తనతో తెచ్చుకున్న ఇనుప చువ్వను బాలిక గొంతులో గుచ్చాడు.తీవ్ర గాయంతో బాలిక ఏడుస్తున్నా మద్యం మత్తులో మృగంగా మారిన నిందితుడు అత్యంత పాశవికంగా రెండుసార్లు అత్యాచారం చేశాడు.అనంతరం బాలికను హత్య చేసి అక్కడే ముళ్లపొదల్లో పడేసి వెళ్లిపోయాడు.ఇంటికి తిరిగి వచ్చిన దంపతులకు బాలిక కనిపించకపోవడంతో అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు బాలిక అన్న చెప్పిన వివరాల ప్రకారం బిహార్‌కు చెందిన యువకులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అత్యాచారం విషయం వెలుగు చూసింది.గురువారం రాత్రి పోలీసులు నిందితుడు రాజేశ్‌ను అరెస్ట్‌ చేశారు.అరెస్ట్‌ చేసిన సమయంలో కూడా నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు.  ‘2 నెలల క్రితమే బిహార్‌ నుంచి వచ్చిన అతడి పూర్వచరిత్రపై ఆరా తీస్తున్నాం. నిందితుడిపై 363, 376/ఎ, 376ఎబి, 302 ఐపీసీ సెక్షన్‌లతోపాటు 5ఆర్‌/డబ్ల్యూ పొక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశాం’ అని డీసీపీ పద్మజ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos