తీసుకున్న అప్పు చెల్లించలేదనే కారణంగా ఓ వడ్డీ వ్యాపారి వ్యక్తి చెల్లిలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన బెంగళూరు నగరంలో ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది..జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన తారక్‌నాథ్ చాలా కాలం క్రితం భార్యతో కలసి బెంగళూరుకు వచ్చిన హుళిమావులో స్థిరపడ్డాడు.రెండేళ్ల క్రితం తారక్‌నాథ్ షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు.అయితే షేర్ మార్కెట్‌లో నష్టాలు రావడంతో దివాళ తీసిన తారక్‌నాథ్ హుళిమావు సమీపంలోని వడ్డీ వ్యాపారం చేస్తున్న బాలాజీ అనే వ్యక్తి వద్ద రూ.6లక్షలు అప్పు తీసుకొని షేర్ మార్కెట్‌లో పెట్టాడు. రెండవసారి కూడా షేర్ మార్కెట్‌లో నష్టాలు రావడంతో అప్పు చెల్లించడం సాధ్యం కాలేదు.అప్పు చెల్లించాలంటూ బాలాజీ తరచూ తారక్‌నాథ్ ఇంటికి వచ్చి ఒత్తిడి చేసేవాడు.ఈ క్రమంలో ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న అనంతరం తారకనాథ్ చెల్లెలు కొద్ది కాలం క్రితం తన అన్న ఇంటికి వచ్చి ఇక్కడే ఉండసాగింది.అప్పు చెల్లించాలంటూ ఒకరోజు తారక్‌నాథ్ ఇంటికి వచ్చిన బాలాజీ తారక్‌నాథ్ చెల్లిలిని చూసి ఆమెను లొంగదీసుకోవడానికి కుట్రలు పన్నాడు.అప్పు చెల్లించాలంటూ ప్రతీరోజూ తారక్‌నాథ్ ఇంటికి వెళుతున్న బాలాజీ తారక్‌నాథ్ చెల్లిలిని లైంగికంగా కూడా వేధించసాగాడు. అయితే తన అన్న అప్పు చెల్లించలేకపోతుండడంతో బాధితురాలు మౌనంగానే బాలాజీ ఆకృత్యాలు భరిస్తూ వచ్చింది. ఇలా రెండేళ్ల పాటు బాలాజీ ఆకృతాలను మౌనంగా భరిస్తుండగా కొద్ది రోజులుగా బాలాజీ వేధింపులు మరింత తీవ్రతరమయ్యాయి.కొద్ది రోజుల క్రితం తారక్‌నాథ్‌ను అపహరించిన బాలాజీ తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు.తనకు ఇటీవలే ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం వచ్చిందని కొద్దిగా సమయం ఇస్తే అప్పు వడ్డీతో సహా చెల్లిస్తానంటూ బాధితురాలు విన్నవించినా బాలాజీ వినకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.కేసు నమోదు చేసుకున్న హుళిమావు పోలీసులు బాలాజీని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు..