పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ కార్యకర్తలు చేపట్టిన మద్దతు ర్యాలీ హింసాత్మకంగా మారింది. ముందస్తు అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు – పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.విషయం తెలుసుకున్న జిల్లా డిప్యూటీ కలెక్టర్ ప్రియావర్మ ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులతో నిరసనకారులను అదుపుచేసేందుకు ప్రయత్నించారు.ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలు ప్రియా వర్మతో అసభ్యకరంగా ప్రవర్తించారు.విధుల్లో భాగంగా ఆమె ఆందోళనకారులను చెదరగొడుతున్న సమయంలో అడ్డుకుని జుట్టుపట్టి లాగారు. దీనితో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ప్రియావర్మ జట్టుపట్టిలాగిన వారిని గుర్తించి చెంపచెళ్లుమనిపించింది. ఘటనకు సంబంధించిన ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అయితే దీనికి సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటన పై తీవ్రంగా స్పందించింది.