పరువునష్టం దావా వేయబోతున్నాం:రాంగోపాల్‌ వర్మ..

  • In Film
  • December 16, 2019
  • 183 Views
పరువునష్టం దావా వేయబోతున్నాం:రాంగోపాల్‌ వర్మ..

ఎన్నో వివాదాలు,ఆరోపణల మధ్య పేరు మార్చుకొని విడుదలైన రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.దీంతో ఈ చిత్రం ఇంత దారుణంగా నష్టపోవడానికి కారణమైన వ్యక్తులపై పరువు నష్టం దావా వేయడానికి నిర్ణయించుకున్నట్లు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెలిపాడు. తన చిత్రం కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందనిటైటిల్ అభ్యంతరకరంగా ఉందంటూ నమోదైన కేసులను కోర్టు కొట్టేసిందని వర్మ తెలిపారు. సినిమా విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడాతన చిత్రంపై కొందరు ఆరోపణలు చేశారనివీరి వెనుక ఎవరున్నారో తనకు తెలుసని చెప్పారు. వీరి వల్ల తన సినిమా విడుదల ఆలస్యమైందని మండిపడ్డారు.కేసులను కోర్టు కొట్టేసిన తర్వాత కూడా ఆరోపణలు చేయడం, విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తమకు నష్టం జరిగిందని చెప్పారు. ఎవరెవరైతే ఆటంకాలు కలిగించారో, డబ్బు తీసుకుని తమను ఇబ్బంది పెట్టారో వారిపై కేసులు వేయబోతున్నామని అన్నారు. వీరిలో ఇంద్రసేనా చౌదరి, కేఏ పాల్, సెన్సార్ అధికారిణి జ్యోతిలు కూడా ఉన్నారని చెప్పారు. వీరందరిపైనా రూ. 20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.ఇదిలా ఉండగా క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సెటైర్లు వేశారు. ప్రపంచ యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటున్న పాల్తన సినిమాఅమ్మ రాజ్యంలో కడప బిడ్డలును మాత్రం ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు.కాగా చిత్రంలో తనను ఉద్దేశపూర్వకంగా అవమానించాడని,మార్ఫింగ్‌ ఫోటోలతో తన పరువుకు భంగం కలిగించాడంటూ కేఏ పాల్‌ ఆరోపణలకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు హాజరు కావాలని సూచించిన నేపథ్యంలో సోమవారం రాంగోపాల్‌ వర్మ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నాడు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos