తెలుగుదేశం నుంచి మరో ఎమ్మెల్యే వైసీపీ వైపు అడుగులు వేయడానికి
మార్గం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే
మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వైసీపీలో చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.గత
ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తెదేపా బరిలో దిగిన మోదుగుల వైసీపీ
అభ్యర్థి అప్పిరెడ్డిపై విజయం సాధించారు.త్వరలో జరుగనున్న ఎన్నికల్లో సత్తెనపల్లి ఎమ్మెల్యే
సీటు కానీ లేదా నరసరావుపేట ఎంపీ సీటు కానీ తనకు కేటాయించాలంటూ మోదుగుల తెదేపా
అధినేత చంద్రబాబును కోరినట్లు సమాచారం.అందుకు అంగీకరించపోగా తనకు ఏమాత్రం
ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ మోదుగులు సన్నిహితుల వద్ద వాపోయారని తెలుస్తోంది.దీంతో
వైసీపీలో చేరడానికి మోదుగుల నిర్ణయించుకున్నారని ప్రస్తుతం లండన్ టూర్ లో ఉన్న జగన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత మోదుగుల వైసీపీలోకి అధికారికంగా జాయిన్ అవుతారని సమాచారం. అయితే సత్తెనపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్పల్పమెజారిటీతో ఓడిపోయారు అంబటి రాంబాబు. మరి ఈసారి సత్తెనపల్లి టిక్కెట్ అంబటి రాంబాబుకు దక్కుతుందా లేదా మోదుగులకే ఇస్తారా అనేది జగన్ లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాతే తేలనుంది..