గత
దశాబ్ద కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ తీరు తెన్నులు మారుతున్నాయి.యవరక్తం తెలుగు
చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడంతో తెలుగు చిత్రాలు కొత్తదనంలో పరుగులు పెడుతూ ఇతర
చిత్రపరిశ్రమలకు ముఖ్యంగా బాలీవుడ్‌కు సవాల్ విసురుతోంది.కొత్తదనం ఉంటే చాలు
ప్రతినాయకుడి పాత్రను పోషించడానికి సైతం నేటి తరం హీరోలు వెనుకడుగు వేయడం లేదు.జై
లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ ప్రతినాయక ఛాయలున్న పాత్రను పోషించి విమర్శకుల మెప్పు
పొందారు.ఇటువంటి ప్రయోగాలు చేయడానికి హీరో నాని ఎప్పుడు ముందు ఉంటారు అనడంలో
అతిశయోక్తి కాదేమో.గతంలో ఇంద్రగంటి దర్శకత్వంలో జెంటిల్మెన్ చిత్రంలో ప్రతినాయక
ఛాయలు కలిగిన పాత్రను పోషించిన నాని ఈసారి అదే ఇంద్రగంటి దర్శకత్వంలో పూర్తిస్థాయి
ప్రతినాయక పాత్రను పోషించడానికి అంగీకరించినట్లు చిత్రవర్గాల్లో చర్చలు
సాగుతున్నాయి.త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్న ఈ చిత్రంలో సుధీర్‌బాబు నాయకుడి
పాత్ర పోషిస్తుండగా నాని ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నట్లు సమాచారం. అయితే ఎవరి పాత్ర ఎంత వుంటుంది అన్నది తెలియలేదు.పాత్రల
తీరుతెన్నులు,చిత్రానికి సంబంధించి మరి కొద్దిరోజుల్లో ప్రకటన విడుదల కానున్నట్లు
సమాచారం.సహజంగానే నటనలో ప్రతిభ
కనబరచిచే ప్రతినాయకుడిగా కచ్చితంగా అందరిని సమ్మోహితుల్ని చేసేలా నటనాకౌశల్యం ప్రదర్శిస్తారని అనుకోవాలి.