ఏఐఏడిఎంకే, భాజపా మధ్య‘ పొత్తు ’ పొడిచేనా

ఏఐఏడిఎంకే, భాజపా మధ్య‘ పొత్తు ’ పొడిచేనా

చెన్నై: అన్నాడీఎంకే, బీజేపీల మధ్య వచ్చే లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాటు మంతనాలు కొలిక్కి రాక పోవటంతో  భాజపా  అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర రైల్వే మంత్రి  పీయుష్‌ గోయల్‌ల మంగళవారం చెన్నై పర్యటన రద్దైంది . పొత్తు గురించి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, అన్నాడీఎంకే నేతలతో గత రెండు వారాలుగా సంప్రదింపులు జరుపుతున్నారు.తమిళనాడులో అన్నా డీఎంకేతో కలిసి అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకోవాలని భాజపా వ్యుహ రచన చేస్తోంది.  కొంగు ప్రాంతంలో అత్యధిక స్థానాల్లో పోటీకి బీజేపీ పట్టుబడుతుండగా అన్నాడీఎంకే ససేమిరా అంటోంది. కూటమిలోని మరో పార్టీతో కలిపి బీజేపీకి ఏడు లేదా ఎనిమిది సీట్లు మాత్రమే ఇస్తామని  అన్నా డీఎంకే తేల్చిచెప్పింది. 2014 ఎన్నికల్లో.. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో అన్నాడీఎంకే 37 స్థానాలు కైవసం చేసుకుంది. మిగిలిన రెండు స్థానాల్లో అప్పటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.

అణ్నా
డిఎంకె నీడకు పిఎంకె

పట్టాలి మక్కళ్‌ కట్చి(పీఎంకే) అన్నాడీఎంకే కూటమిలో చేరింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్పం నేతృత్వంలోని అన్నాడీఎంకేతో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌ పొత్తు కుదుర్చుకున్నారు. దీని ప్రకారంఏడు స్థానాలల్లో  పీఎంకేపోటీ  చేయనుంది. 21 విధాన సభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకేకు పీఎంకే మద్దతు ఇవ్వనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos