దేశాన్ని ఫణంగా పెట్టనివ్వం

దేశాన్ని ఫణంగా పెట్టనివ్వం

అమరావతి:కేంద్రానికి తెలిసే పుల్వామాలో ఉగ్రదాడి జరిగిందని మమతాబెనర్జీ అనుమానించారు. దేశ భద్రత కోసం ఐక్యంగా పోరాడేందుకు మనం వెనుకాడం కానీ.. మోదీ ఏమైనా చేస్తారు. గోద్రాలో 2 వేల మంది అమాయకుల్ని హతం చేసారు రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని ఫణంగా పెడితే ఉపేక్షించేది లేదు’’అని 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
మంగళవారం పార్టీ నేతలో ఆయన  ఇక్కడ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

తెదేపా నేతలకు బెదిరింపులు

వైకాపా తెలంగాణ ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర రావు సాయంతో తమ పార్టీ నేతల్ని బెదిరించి వైకాపాలోకి బలవంతంగా చేర్చుకుంటున్నారని ఆరోపించారు. మరో వైపు చంద్రశేఖర రావు కూడా  హైదరాబాద్‌లో ఆస్తులున్నవారితో మంతనాలు జరిపి  వైసీపీలో చేరాలని ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. పదవుల మీద ఆశలున్న వారిని జగన్, కేసీఆర్ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.  ఇంకా ఒకరిద్దరు పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు.  ఒకరిద్దరికి తప్పుడు సర్వేలు చూపి మభ్య పెడుతున్నారు. వాటిని వాస్తవాలని భ్రమించిన కొందరు పార్టీ ఫిరాయిస్తున్నారని, అలాంటి వారిని పట్టించుకోవద్దని  హితవు పలికారు. తమ రాజ్యాధికార పతనానికి  కేసీఆర్‌, జగన్‌ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరంపై కేసులు వేసినవాళ్లతో వైసీపీ లాలూచీ పడిందన్నారు. మూడు పార్టీల కుట్రలు నెరవేరితే రాష్ట్రానికి నీళ్లు రావ న్నారు.   పోలవరంపై కేసీఆర్‌ కేసు వేస్తే జగన్‌ స్పందించడం లేదని.. ఇటువంటి జగన్‌ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తవుతుందా, ఆంధ్ర ప్రదేశ్‌లో అభివృద్ధి జరుగుతుందాని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలతో జగన్‌కు నిరాశ అధికమైందని వ్యాఖ్యానించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos