పాక్‌పై దాడికి బలూచ్‌ పిలుపు

పాక్‌పై దాడికి బలూచ్‌ పిలుపు

వాషింగ్టన్‌ : పుల్వమా దాడికి ప్రతీకారంగా పాక్‌పై దాడి చేసి ముష్కరుల్ని న్యాయస్థానం శిక్షించేలా చర్యలు చేపట్టాలని అమెరికాలోని పాక్‌ వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (బిఎన్‌సి) భారత్‌కు విజ్ఞప్తి చేసింది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన దాడిని ఖండించింది. ఈ సంస్థ పాక్‌లోని బలూచిస్థాన్‌ రాష్ట్ర స్వాతంత్ర్యం కోసం ఈ సంస్థ పోరాడుతోంది. పాక్‌ తో రకాలు సంబంధాల్ని తెంచుకోవాలని కోరింది. భారత్‌లోని పాక్‌ హైకమిషనర్‌ను బహిష్కరించి, పాక్‌లో ఉన్న భారత్‌ హైకమిషనర్‌ను వెనక్కు పిలిపించాలని విన్నవించింది.

మానవాళికి పాక్‌ ముప్పు

మానవాళికి పాక్‌ పెనుముప్పుగా మారిందని విమర్శించింది. బలూచిస్థాన్‌ ప్రజలు సుదీర్ఘకాలంగా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నారు. పాక్‌ ప్రభుత్వం దమననీతిలో వారిని అణచివేస్తోంది. పాక్‌ సైనికుల దురాగతాలకు భయపడిన వేలాదిమంది బలూచీ ప్రజలు ఇతర దేశాలకు వలసవెళ్లారు. ప్రవాసంలో ఉంటున్న బలూచీనేత ఖాన్‌ కలాత్‌ నేతృత్వంలో ప్రవాసంలో బలూచీ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు భారత్‌ చేయూతనివ్వాలని  కోరింది. పాక్‌ పై ఆక్రమణ కేసు అంతర్జాతీయ న్యాయస్థానంలో దాఖలుకు
సహకరించాలని విజ్ఞప్తి చేసింది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos