త్వరలో జరుగన్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ
విజయపతకాం ఎగురవేయడం తథ్యమంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు.ఏడాది
కాలంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే తెలుగుదేశం అధికారం కోల్పోవడం
ఖాయమని అధికారులు భావిస్తున్నారు.విశాఖపట్టణం విమానాశ్రయంలో వైసీపీ అధినేతపై జరిగిన
దాడి,ఏడాది కాలంగా సాగిన సంకల్పయాత్ర,బీసీ గర్జన సభ వీటన్నింటికి ప్రజల నుంచి స్పందన
భారీగా లభించిదని ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే వైసీపీ విజయం దాదాపు ఖరారైనట్లేనని
అధికారులు భావిస్తున్నారు.ఇక ఎన్నికలకు మూడు నెలలే గడువు ఉండడంతో ప్రస్తుత ప్రభుత్వంతో ఎలా మసలుకోవాలి ప్రభుత్వ నిర్ణయాలకు ఎలా స్పందించాలి వంటి అంశాలపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రానున్న ఈ మూడు నెలలు కరిస్తే కప్పకు కోపం…. విడిస్తే పాముకు కోపం అన్న తీరుగా ఉంటుందని ఉన్నతాధికారులు వాపోతున్నారట. తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయాలను కఠినంగా అమలు చేస్తే ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే చిక్కులు తప్పవేమోనని అధికారులలో ఆందోళన కలిగిస్తోంది. రానున్న మూడు నెలలు ఐఏఎస్ – ఐపిఎస్ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. కొందరు అధికారులు ఇప్పటికే తమకు పరిచయం ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటి నుంచే పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకుంటే భవిష్యత్తులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎలాంటి చిక్కులు ఉండవని భావిస్తున్నారు.