న్యూఢిల్లీ: అమరుడైన జవాన్ ప్రదీప్సింగ్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోదీ మాటలను, ప్రభుత్వాన్ని నమ్మలేమని ప్రదీప్ సింగ్ భార్య నీరాజ్ అన్నారు. గతంలో కూడా కశ్మీర్లో తీవ్రవాదుల దాడులు జరిగాయి, అయినా భద్రతా దళాలకు సంపూర్ణ స్వేచ్ఛ ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించింది.ఆ నిర్లక్ష్యమే ఈ మారణహోమానికి దారితీసిందని నిష్టూరమాడింది. జవాన్ల త్యాగాలను ప్రభుత్వం ఎప్పుడూ గౌరవించలేదని ప్రదీప్ తండ్రి మండిపడ్డారు. తన కొడుకు త్యాగాన్ని ప్రజలు మూడురోజుల్లో మర్చిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ, టెర్రరిస్టుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. తన సోదరుడి ప్రాణాల కంటే నష్ట పరిహారం విలువైందేమీ కాదని ప్రదీప్ అన్న చెప్పారు.